బిల్లింగ్
ప్రొడక్ట్ ను కార్ట్ లో జోడించడం ఎలా?
మీరు న్యూ ఆర్డర్ బటన్‌ను నొక్కిన తర్వాత కనిపించే కేటలాగ్ స్క్రీన్ నుండి క్రొత్త ప్రొడక్ట్ ను జోడించవచ్చు. ప్రొడక్ట్ ను జోడించడానికి మూడు ఎంపికలు ఉన్నాయి:
 • కనెక్ట్ చేయబడిన బార్‌కోడ్ స్కానర్‌ను ఉపయోగించి ప్రొడక్ట్ యొక్క బార్‌కోడ్‌ను స్కాన్ చేయండి
 • సెర్చ్ బార్ ను ఉపయోగించి ప్రొడక్ట్ కోసం సెర్చ్ చెయ్యండి
 • కేటలాగ్ స్క్రోల్ నుండి ప్రొడక్ట్పై నొక్కండి మరియు జోడించండి
బిల్లింగ్ కు ముందు ప్రొడక్ట్ యొక్క ధరను ఎలా ఎడిట్ చేయగలము?
ఐటమ్ పై కుడివైపు స్వైప్ చేసి, ఎడిట్ ప్రైస్ ఎంపికను టాప్ చెయ్యడం ద్వారా నిర్దిష్ట ఆర్డర్ కోసం ఒక ఐటమ్ యొక్క ధరను సవరించవచ్చు.
నేను కొనసాగుతున్న ఒక ఆర్డర్‌ను క్యూ చేసి కొత్త ఆర్డర్‌ను ప్రారంభించవచ్చా?
మీ అప్లికేషన్లో కార్ట్ స్క్రీన్ దిగువన క్యూ పై నొక్కడం ద్వారా కొనసాగుతున్న ఆర్డర్‌ను మీరు క్యూ చేయవచ్చు.
ఇన్వాయిస్ ఎలా రిఫండ్ చెయ్యగలము?
 • డాష్‌బోర్డ్> సేల్స్ కు వెళ్లండి
 • ఇన్వాయిస్ టాబ్ ఎంచుకోండి మరియు రిఫండ్ చెయ్యాల్సిన ఇన్వాయిస్ కోసం సెర్చ్ చెయ్యండి
 • రిఫండ్ పై నొక్కండి. ఇది మిమ్మల్ని బిల్లింగ్ సెక్షన్ కి మళ్ళిస్తుంది
 • ఎడమవైపు స్వైప్ చేసి, డిలీట్ ఐటమ్స్ పై టాప్ చెయ్యడం ద్వారా రిఫండ్ చెయ్యవచ్ఛు
 • ప్రొసీడ్ పై నొక్కండి మరియు వాపసు పరిష్కరించడానికి ఉపయోగించే చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి
ఓపెన్ చేసిన ఆర్డర్ ను ఎలా విస్మరించాలి?
ఓపెన్ లో ఉన్న ఆర్డర్ ను విస్మరించడానికి కార్ట్ యొక్క కుడి ఎగువ మూలలో అందుబాటులో ఉన్న డిస్కార్డ్ ఐకాన్ పై నొక్కండి గమనిక: ఆర్డర్ క్లోస్ చేయబడిన తర్వాత దాన్ని విస్మరించలేము
IMEI మరియు వారంటీ వంటి ప్రోడక్ట్ వివరణను నేను ఎలా జోడించగలను?
 • ఈ వివరాలను రికార్డ్ చేయడానికి అవసరమైన ఐటమ్స్ పై కుడివైపు స్వైప్ చేయండి మరియు ప్రోపర్టీస్ పై నొక్కండి.
 • IMEI మరియు వారంటీ వంటి విండోలో అవసరమైన వివరాలను ఫీడ్ చేయండి.
కార్ట్ స్క్రీన్‌లో "యాడ్ కామెంట్" ఏమి చేస్తుంది?
నిర్దిష్ట లావాదేవీకి సంబంధించిన అదనపు వివరాలను జోడించడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. ఇది ఇన్వాయిస్లో ప్రింట్ చెయ్యబడుతుంది.
ఐటమ్ లెవల్ మరియు కార్ట్ లెవల్ పై డిస్కౌంట్ ఎలా వర్తింపజేయాలి?
ఐటమ్ లెవల్ డిస్కౌంట్స్ :
 • మీరు డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్న ఐటమ్ పై కుడివైపు స్వైప్ చేయండి
 • ఎడిట్ ప్రైస్ పై నొక్కండి, తర్వాత డిస్కౌంట్ ఎంపికను ఎంచుకోండి
 • అందుబాటులో ఉన్న డిస్కౌంట్ రకాన్ని ఎంచుకోండి, అంటే, శాతం, ఫ్లాట్ లేదా కూపన్ డిస్కౌంట్
 • అవసరమైన డిస్కౌంట్ విలువను నమోదు చేసి,అప్లై పై నొక్కండి
కార్ట్ లెవల్ డిస్కౌంట్స్:
 • కార్ట్ దిగువన ఉన్న గ్రాండ్ టోటల్ లేదా డిస్కౌంట్ పై నొక్కండి
 • అందుబాటులో ఉన్న డిస్కౌంట్ రకాన్ని ఎంచుకోండి, అంటే, శాతం, ఫ్లాట్ లేదా కూపన్ డిస్కౌంట్
 • అవసరమైన డిస్కౌంట్ విలువను నమోదు చేసి,అప్లై పై నొక్కండి
నేను ఇన్‌వాయిస్‌ను డిలీట్ చెయ్యవచ్చా?
లేదు, ఇన్వాయిస్ తొలగించబడదు. అయినప్పటికీ, సేల్స్ డేటాను లెక్కించడానికి మీరు రిఫండ్ ను ప్రాసెస్ చేయవచ్చు.
డిజిటల్ ఇన్వాయిస్‌లకు స్మార్ట్ రిటైల్ సపోర్ట్ ఇస్తుందా?
అవును, మా POS ఎస్సెమ్మెస్ మరియు ఇమెయిల్ ఇన్వాయిస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇన్వాయిస్లు వినియోగదారులకు పంపేందుకు వారి యొక్క ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను కస్టమర్ డిటైల్స్ సెక్షన్ లో రికార్డ్ చేయవలసి ఉంటుంది.
సేల్స్ చానెల్స్ అంటే ఏమిటి?
మీరు మీ ప్రొడక్ట్లను విక్రయించే వివిధ పద్ధతులను సేల్స్ ఛానెల్స్ అంటారు. ఉదా: ఇన్- స్టోర్ / వాక్-ఇన్, హోమ్ డెలివరీ, ఆన్‌లైన్ సేల్స్ మొదలైనవి.
బిల్లింగ్ కోసం సేల్స్ ఛానెల్‌ను ఎలా ఎంచుకోవాలి?
బిల్లింగ్ సెక్షన్లో, పేజీ ఎగువున చూపిన సేల్స్ ఛానెల్‌పై నొక్కండి. మీరు సృష్టించిన సేల్స్ ఛానెల్ లిస్ట్ లో ఒక పాప్ అప్ కనిపిస్తుంది
బ్యాకెండ్ పోర్టల్‌లో చేసిన మార్పులను ఎలా (sync) సమకాలీకరించాలి?
ప్రస్తుతం ఉన్న పేజీలో కుడివైపు స్వైప్ చేయండి, "సింక్ స్టోర్" ఎంపికపై నొక్కండి
బిల్లింగ్ సమయంలో కస్టమర్ వివరాలను తప్పనిసరిగా నమోదు చెయ్యాలా?
లేదు, POS లో కస్టమర్ డిటైల్స్ తప్పనిసరి కాదు. అయితే, కస్టమర్ వివరాలను తప్పనిసరి చేయడానికి సెట్ చేయవచ్చు